
సిపిఐ వేసిన బస్తీలో ఉన్నంతకాలం సత్తయ్య గుర్తుండిపోతారు.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్.
సిపిఐ కుత్బుల్లాపూర్ మాజీ మండల కార్యదర్శి గిరి నగర్, జగద్గిరిగుట్ట, గూడెంమెట్,మక్డుం నగర్,లెనిన్ నగర్, రావి నారాయణరెడ్డి నగర్ లాంటి అనేక బస్తీలను నిర్మించినటువంటి కామ్రేడ్ సత్తయ్య ఏడవ వర్ధంతిని నేడు గుబురు గుట్టలో ఉన్న వారి స్మారక స్థూపం వద్ద నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ నరసయ్య అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ యేసు రత్నం , నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ పాల్గొని సత్తయ్య ఆటో యూనియన్ నుంచి మొదలుకొని పొట్లూరు నాగేశ్వరరావు చేత సిపిఐ పార్టీ నాయకత్వం 1970 లో ఆ కామ్రేడ్ సత్తయ్య గారు సిపిఐ పిలుపునిచ్చినటువంటి భూ పోరాటం కార్యక్రమానికి నాయకత్వం వహించి వేలాది ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కామ్రేడ్ సత్తయ్య కి దక్కుతుందని, కామ్రేడ్ సత్తయ్య కామ్రేడ్ నాగయ్యలు కలిసి ఎన్నో బస్తీలు నిర్మించారని వారి నిస్వార్థ పోరాట ఫలితమే నేడు వేలాదిమంది ఇక్కడ నివసించడానికి కారణమైందని కావున ప్రతి ఒక్కరూ వారు చేసిన సేవలను ప్రజలకు తెలియజేసి వారిని ప్రజల్లో చిరస్థాయిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలని కార్యకర్తలను కోరారు.
కామ్రేడ్ నాగయ్య కామ్రేడ్ సత్తయ్యలు అనేక పోరాటాలు చేసి ఎన్నో ఎకరాలు పంచినప్పటికీ వారి సొంతానికి ఎదగలేదని అది సిపిఐ పార్టీ ఇచ్చినటువంటి స్ఫూర్తి అని, ఆస్పూర్తితోనే నేటి కార్యకర్తలు పనిచేయాలని డబ్బు, పదవి ఇవేవీ శాశ్వతం కాదని ప్రజలకు చేసే సేవనే శాశ్వతం అని గుర్తుపెట్టుకుని రాజకీయాలు చేయాలని సూచించారు.
వారి సహచరులు బాల్నర్సయ్య, నరసయ్య వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు హరినాథ్ , మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, డి హెచ్ పి ఎస్ నాయకులు రాములు కూడా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి యాకూబ్, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, మల్లేష్, మల్లయ్య, ఖాదర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
