
సూర్యచంద్రులున్నంత కాలం తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది
నాలుగు దశాబ్ధాలుగా తెలుగుదేశం జెండాను భుజస్కంధాలపై మోస్తున్న కార్యకర్తలే నిజమైన దేవుళ్లు
ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య
ఎన్టీఆర్ జిల్లా,నందిగామ టౌన్ –
నలభై మూడేళ్లు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ ఎగరేసిన జెండా ఇప్పటికీ సగర్వంగా ఎగురుతూనే ఉందన్నారు ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య . టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా నందిగామ టౌన్ పలు (13,10,7) వార్డులలో మరియు రైతు పేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలానే మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా కూటమి నేతలతో కలసి తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటే పేదలకు ఓ భరోసా. కడుపు నిండా తిండికి…కట్టుకోవడానికి గుడ్డకి.. ఉండటానికి ఇంటికి చింత పడాల్సిన అవసరం లేనంత ధైర్యం పేదలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. నాడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం.. పథకం ఇప్పటికీ కొనసాగుతుందంటే టీడీపీ ముద్ర ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు మద్రాసీలు అనే ముద్ర ఉన్న తెలుగువారిని.. మద్రాసీలు కాదు..తెలుగు వారు అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా చేయాలనేది ఎన్టీఆర్ తపన. ఆ విషయంలో ఆయన అడుగుజాడల్లో పార్టీని నడుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగువారంటే ..తెలుగు వారే అన్న అభిప్రాయాన్ని తీసుకువచ్చారన్నారు.
పేదలకు సంక్షేమం కాదు.. వారిని ఆర్థికంగా, సామాజికంగా కూడా పైకి తీసుకువచ్చే విధానాలను టీడీపీ పాటిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన లక్ష్యాన్ని వంద శాతం సాధించడానికి ..ఎప్పుడూ సరైన దారిలోనే వెళ్తోందన్నారు. ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రజా సంక్షేమం.. ప్రజాభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తుందన్నారు. అదే పార్టీ వ్యవస్థాపకుడు.. మహనీయుడు ఎన్టీఆర్‌కు ఇచ్చే అసలైన గౌరవమన్నారు.
