Spread the love

వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఎర్త్ అవర్ గ్లోబల్ ఉద్యమంలో భాగంగా, ఎల్లుండి రాత్రి 8 గంట‌ల 30 నిమిషాల నుంచి 9 గంట‌ల 30 నిమిషాల‌ వరకు ఒక గంట పాటు ‘ఎర్త్ అవర్’ పాటించాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎర్త్ అవర్ ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఒక గంట పాటు అనవసరమైన లైట్లను స్వచ్చందంగా నిలిపి వేయడం ద్వారా.. వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలను ఏకం చేస్తూ, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించడంలో సహాయపడుతుందని గవర్నర్ తెలిపారు.