Spread the love

జలమండలి ప్రధాన కార్యాలయం లో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పరిష్కారించవలసిన పలు సమస్యలపై మరియు చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల కొరకై నిధుల మంజూరి గూర్చి చర్చించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ లో అక్కడక్కడ నెలకొన్న డ్రైనేజి సమస్యల పరిష్కారానికి నిధులను మంజూరి చేయాలనీ PAC చైర్మన్ గాంధీ కోరినారు. పెరుగుతున్న జనవాసలకు అనుగుణంగా కాలనీ వాసుల దాహార్తి ని తీర్చడానికి, మిగిలిపోయిన అసంపూర్తి మంచి నీటి పైప్ లైన్ నిర్మాణము కొరకు అదనంగా మంచినీటి పైప్ లైన్ నిర్మాణం కొరకు నిధులు మంజూరి చేయాలని, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ఎండకాలంను దృష్టిలో పెట్టుకొని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే గాంధీ కొరినారు.

అదేవిధంగా ఎండకాలం ను దృష్టిలో పెట్టుకొని మంచి నీటి ఎద్దడి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, మంచి నీటి కొరత రాకుండా అందరికి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలని ప్రజావాసరాలును దృష్టిలో పెట్టుకొని అదనపు మంచి నీటిని విడుదల చేయాలని, ప్రజల దాహార్తి తీర్చేవిధంగా, మంచి నీటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిరకాల చర్యలు తీసుకోవాలని
PAC చైర్మన్ గాంధీ జలమండలి MD అశోక్ రెడ్డి ని కొరినారు.

దీనికి సానుకులంగా స్పందించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ పైన పేర్కొన్న సమస్యల పై సానుకూలంగా స్పందించడం జరిగినది. అదేవిధంగా డ్రైనేజి సమస్య పరిష్కారానికై UGD పైప్ లైన్ నిర్మాణం పనులకు నిధులు మంజూరు చేస్తామని, అదనపు మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తామని, అదనపు మంచి నీటిని విడుదల చేస్తామని, సీవరేజ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని దశల వారీగా నిధులను సమకూరుస్తానని ఎండీ అశోక్ రెడ్డి తెలియచేసారు దీనికి PAC చైర్మన్ గాంధీ జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేయడం జరిగినది.