
అశ్వారావుపేట :వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని 100, పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ గృహనిర్మాణం సమాచార పౌరసంబందాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ. ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించినట్లు మంత్రి పొంగలేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం అశ్వారావుపేట లో వంద పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, వైద్య అధికారులు పాల్గొన్నారు.
