
రైల్వే సంఘ్ ఆఫీస్, కాజిపేట్
కాజీపేట రైల్వే క్రూ కంట్రోల్ నుండి అసిస్టెంట్ లోకో పైలట్ పైలెట్స్ & లోకో పైలెట్లను (రైల్వే ట్రైన్ డ్రైవర్లు) మరియు గార్డులను విజయవాడకు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నిన్న 185 మంది అసిస్టెంట్ డ్రైవర్లను తరలిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆర్డర్ విడుదల చేయటాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కాజీపేట రైల్వే సంగ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
కాజీపేట ను రైల్వే డివిజన్ కేంద్రం చేయాలని డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కృషి చేస్తుందని, స్థానిక వరంగల్ ఎంపీ కడియం కావ్య నేతృత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖకు మరియు సికింద్రాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ గార్ల దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తుంటే కొందరు అధికారులు లోపాయికారి కుట్రతో కాజీపేట రైల్వే డివిజన్ స్థాయిని తగ్గించడానికి కాజీపేట రైల్వే జంక్షన్ నుండి పలు విభాగాలను తరలిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని అందులో భాగమే నిన్న 185 మంది రైల్వే అసిస్టెంట్ డ్రైవర్లను తరలిస్తున్నట్లు ఆర్డర్ విడుదల చేయడమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
గత 25 సంవత్సరాలుగా కాజీపేట క్రూ కంట్రోల్ నుండి డ్రైవర్లను గార్డులను తరలిస్తూ ఎన్నో ఇబ్బందులకు రైల్వే కార్మికుల మానసికక్షోభకు కొందరు అధికారులు గురి చేస్తుంటే గతంలో కూడా ఉద్యమాలు చేసి నిలిపి వేసే విధంగా అందరి సహాయ సహకారాలతో ఉద్యమించి కృషి చేసామని MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మొదటినుండి కట్టుబడి ఉన్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం లో పొందుపరిచిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అదేవిధంగా రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ రిపేర్ యూనిట్ నిర్మాణం మరియు ఫిట్ లైన్ ఏర్పాటు మరియు కాజీపేట రైల్వే ప్లాట్ఫామ్స్ పెంచి ఇక్కడి నుండే పలు జిల్లాలకు, రాష్ట్రాలకు రైలు వెళ్లే విధంగా అభివృద్ధి చేస్తూ కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంటే కొందరు అధికారులు కక్ష సాధింపు చర్యలు చేస్తూ రైల్వే గార్డులను గతంలో 17 మందిని ఇటీవల ఇక్కడి నుంచి పంపించారని నిన్న 185 మంది అసిస్టెంట్ డ్రైవర్లను పంపిస్తున్నట్లు ఆర్డర్ విడుదల చేశారని వెంటనే ఈ చర్యలు నిలిపివేయాలని లేదంటే స్థానిక అన్ని రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సంస్థ లు మరియు రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమిస్తామని నాయిని రాజేందర్ రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బిజెపి నాయకులకు విజ్ఞప్తి రైల్వే పరంగా కాజీపేట డివిజన్ తేవడానికి కలిసి ముందుకు రావాలని కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి & బండి సంజయ్ ల ద్వారా సహాయ సహకారాలు అందించి కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ చేయుటకు కలిసి రావాలని పిలుపునిస్తున్నాం అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్, సయ్యద్ విజయశ్రీ రజాలి, జిల్లా అధికార ప్రతినిధి & బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు మహమ్మద్ అంకుస్, బంక సంపత్ యాదవ్, షేక్ అజ్గర్, ఇప్ప శ్రీకాంత్, తమ్మడి మానస, బబ్లు, దువ్వ రాజు, దువ్వ రేవతి, గుర్రం అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
