జీఎస్‌టీ 2.0పై ప్రజలకు అవగాహన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి

TEJA NEWS

జీఎస్‌టీ 2.0పై ప్రజలకు అవగాహన

కేతంరెడ్డి వినోద్‌రెడ్డి

నెల్లూరు జీఎస్‌టీ 2.0 సంస్కరణలతో సామాన్యులకు నెలకు 5 వేల నుంచి 20 వేల వరకు ఆదా అవుతుందని టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌ రెడ్డి అన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలతో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి 2వ రోజు నెల్లూరు సిటీ పరిధిలోని బాలాజీ నగర్‌ అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌ ఏరియాలో జీఎస్‌టీ సంస్కరణపై స్థానికులకు, చిరు వ్యాపారులకు అవగాహన కల్పించారు. ప్రతి దుకాణానికి తిరుగుతూ, స్థానికులను పలకరిస్తూ ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్‌టీ సంస్కరణలపై తెలియజేశారు. నిత్యం ఉపయోగించే వస్తువులపై తగ్గిన పన్నులను వివరించారు. దేశవ్యాప్తంగా ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు.వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జీఎస్‌టీలో సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. జీఎస్‌టీ 2.0తో ప్రజలు నిత్యం ఉపయోగించే పప్పు, ఉప్పు, చెప్పులు, చీపురు వంటి అనేక రకాల వస్తువులపై జీరో ట్యాక్స్‌ చేశారని వెల్లడించారు. ప్రపంచ దేశాల్లో భారత దేశాన్ని అగ్ర పథాన నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్నారు. అటు ప్రధాని మోదీ సహకారం, ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం ఆర్థికాభివృద్ధి చెందుతోందన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుడి హరిరెడ్డి, టిడిపి కనకేశ్వరరావు, జాన్ డేవిడ్, ఉడాలి సూర్యనారాయణ, కమ్మ పెంచలయ్య చౌదరి, నలిశెట్టి శ్రీనివాసులు, మాధవ్ నాయుడు, షమీమ్, వినయ్, కుక్క ప్రభాకర్, మహిళా నాయకులు జాన్సీ, కుసుమ, భార్గవి, అనుష తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top