
ఎడ్లపాడు మండలంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ర్యాలీ
యడ్లపాడు:
ఎడ్లపాడు మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి సేద్యంపై నిర్వహించిన సభలో ప్రకృతి విభాగ అధికారులు రామచంద్రరావు, ప్రేమ్‌రాజ్ పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయం, పిఎండిఎస్ ప్రాధాన్యతను వివరించారు.
రైతులకు ఏటీఎం మోడల్, ఏ గ్రేడ్ మోడల్ వ్యవస్థల గురించి అవగాహన కల్పిస్తూ, ప్రకృతి పద్ధతుల్లో సాగు చేసే ప్రయోజనాలను వివరించారు. అనంతరం రైతులతో ముఖాముఖి చర్చ నిర్వహించి, వారికి సన్మానం చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా పీఎండిఎస్ కిట్ల తయారీ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, సౌజన్య, బేబీరాణి, ఐలయ్యతో పాటు ఎల్2, ఎల్3 సభ్యులు కూడా పాల్గొన్నారు.
గ్రామస్థులు ఈ కార్యక్రమానికి విశేష స్పందన చూపారు.
