TEJA NEWS

ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య రామ మందిర్

అయోధ్యలోని నూతన రామాలయం లో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తాజాగా కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. గడచిన ఏడాదిలో అయోధ్యకు రూ. 700 కోట్లు అందింది. అదే విధంగా షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతుండగా, వైష్ణోదేవికి రూ. 400 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది.