
అయోధ్య ఆలయం రికార్డు ఆదాయం..!!
దేశంలో అత్యధిక ఆదాయాల ఆలయాల జాబితాలో అయోధ్య బాలరాముడి ఆలయం(Ayodhya Temple) రికార్డు స్థాయి కానుకలతో (Record Income)మూడో స్థానానికి చేరింది.
ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను బాలరాముడి అయోధ్య మందిర్ అధిగమించేసింది. దేశంలో అత్యధికంగా ఆదాయం అందుతున్న 10 ఆలయాలలో అయోధ్య మూడవ స్థానానికి చేరింది. అయోధ్యలో నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ 2024, జనవరి 22న జరిగినప్పటి నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటున్నారు. అయోధ్య ఆలయానికి అందుతున్న కానుకలు స్వర్ణదేవాలయం, వైష్ణోదేవి, షిర్డీ ఆలయాలకు మించిన రీతిలో అందుతున్నాయి. తాజాగా కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ. ఇటు వైష్ణోదేవి ఆలయాలను దాటేసింది. ప్రస్తుతం యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు.
ఈ నేపధ్యంలో బాలరాముడి ఆదాయం పెరిగింది. గడచిన ఏడాదిలో అయోధ్యకురూ. 700 కోట్లు అదాయం లభిస్తే, షిర్డీ ఆలయానికి ఏటా రూ. 450 కోట్ల వరకూ ఆదాయం సమకూరుతంది. వైష్ణోదేవికి రూ. 400 కోట్ల వరకూ ఆదాయం వస్తుంది. మహాకుంభమేళా ప్రారంభమయ్యాక రూ.15 కోట్ల ఆదాయం సమకూరింది. బాలరాముడి ప్రతిష్టాపన నుంచి నేటివరకు 13 కోట్ల మంది బాలరాముణ్ణి దర్శించుకున్నారు.
