TEJA NEWS

సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహానుభావులు బాబూ జగ్జీవన్ రామ్ : నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా

సూర్యపేట జిల్లా ప్రతినిధి : భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్ 118వ జయంతి వేడుకలు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగినది జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ బాబూ జగ్జీవన్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో, స్వరాజ్యం వచ్చాక ఆధునిక భారత దేశ నిర్మాణంలోనూ స్ఫూర్తివంతమైన సేవలు అందించారని, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవిత కాలం పోరాడారని, అనేక పదవులను చేపట్టి తనదైన ముద్రను వేశారని అన్నారు. జగ్జీవన్రాం జీవిత పర్యంతం బడుగు వర్గాల ‌అభ్యున్నతికై కృషి చేశారని తెలిపారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకపోవాలని అన్నారు, ముఖ్యంగా యూనిఫాం సర్వీస్ తరఫున ప్రత్యేక ఘనంగా నివాళి అర్పించారు. సిబ్బంది అందరుకు కూడా సమాజంలో సమానత్వం చూపాలని అన్నారు. సిబ్బంది పోలీసు విధులు పట్ల, ప్రజల సేవల పట్ల అంకితభావంతో పని చేయాలని కోరారు. మహిళా సిబ్బంది అందరితో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డి.ఎస్.పి లు మట్టయ్య, నరసింహ చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణ రావు, ఆర్.ఐ నారాయణ రాజ, , ఆర్ఎస్ఐ లు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం, మహిళా ఎస్సై ఝాన్సిరాణి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు