
ఉత్తుత్తి స్పందన లు
కమిషనర్ ఆదేశాలు భే ఖాతర్
బయటపడ్డ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అవినీతి
విఎంసి ఆదాయానికి గండి
బిల్డింగ్ ఇన్ స్పెక్టర్ కనుసైగలోనే అక్రమ నిర్మాణం..
విజయవాడ వన్ టౌన్ 53వ డివిజన్ చేపల మార్కెట్ సందు శివాలయం పక్కన అక్రమ నిర్మాణంపై స్థానికులు స్పందనలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసి మూడు రోజులైనా ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఇందుకు కారణం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అవినీతి కారణమని స్పష్టంగా తెలుస్తోంది.
బిల్డర్ కి అండగా ఉండి స్పందన పిటిషన్ బుట్ట దాఖలు చేసే విధంగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ నడుచుకుంటున్నారని..
బిల్డర్ ఇచ్చిన తాయలాలు అందుకొని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందన పిటిషన్ కి స్పందన లేకుండా చేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఈ విషయంపై స్థానికులు కొందరు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ని కలిసినప్పుడు ఈ అక్రమ నిర్మాణం పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని సిటీ ప్లానర్ కు ఎండార్స్ చేశామని, విఎంసి ఆదాయానికి గండి కొట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
