
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ X రోడ్డు వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి MBC చైర్మన్ జేరిపేటి జైపాల్ , కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , దొడ్ల వెంకటేష్ గౌడ్ ,సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి మరియు గౌడ సోదరులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించిన PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అసమానం. మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి ,బహుజన నాయకుడు అయినా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315 వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను అని ,ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి రాజకీయ , సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండ ఏలిన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న జీవితం అసమానం అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు.
సామాన్యులనే సైనికులుగా మార్చి భువనగిరి కోటనే కాదు ఏకంగా గోల్కొండ కోటనే కొల్లగొట్టిన సర్వాయి పాపన్న జీవితం అందరికి ఆదర్శమని , భారత దేశాన్ని పాలించే మొఘల్ చక్రవర్తులు పాపన్న పై దాడి చేస్తే సమాన్యుల్లో స్ఫూర్తిని నింపి మొఘల్ సైన్యాన్ని ఓడించడే తప్ప పాపన్న ఎక్కడ లొంగలేదు అని PAC చైర్మన్ గాంధీ అన్నారు
సమాజంలో జరిగే దురాగతాలను గమనించి గోల్కొండ కోటపై బడుగువారి జెండాను ఎగురవేయాలని నిర్ణయించి ఆ దిశగా ప్రస్థానం ప్రారంభించాడు. అయితే పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం కాని, ధనంకాని, అధికారం కాని లేవు. గెరిల్ల సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసి, తన సొంత ఊరు ఖిలాషాపూర్ ని రాజధానిగా చేసుకొని, 1675 లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. అతని తరపున పోరాడటానికి గెరిల్ల సైన్యాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలను పెంచగల సామర్థ్యం అతని 10,000 –12,000 విస్తృతంగా పెంచడానికి అవసరమైన సంఖ్యకి సాక్ష్యం.
పాపన్న ఛత్రపతి శివాజీకి సమకాలికుడు. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో మొఘల్ పాలన అంతానికి పోరాడారు. 1687 – 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు.
ఒక సామాన్య వ్యక్తి శతృదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి దాదాపు 20 కోటలను తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. అతని ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700 – 1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ దాదాపు 12 వేల సైనికులను సమకూర్చుకొని ఎన్నో కోటలను జయించి చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని 7 నెలలపాటు అధికారం చెలాయించాడు. తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీంనగర్ జిల్లా లోని హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ (మిలిటరీ గవర్నర్) సోదరి. భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు. జానపద కళాకారులు తరతరాలుగా 3, 4 వందల ఏండ్లు గడిచినా, జానపద కథలలో పాపన్న చరిత్ర ఇప్పటికీ స్థానికంగా పాడతారు. జానపద, భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన సందర్భంలోనే చాలా సాక్ష్యాలు సేకరించబడ్డాయి. పాపన్న ఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్టనష్టాలన్నీ తెలుసు. అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు. ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు. పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు. అతని రాజ్యంలో సామజిక న్యాయం పాటించేవాడు. తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు. అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురాబాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు. అది రూపం మారినా నేటికీ అలానే ఉంది అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.
శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొంతి లక్ష్మీనారాయణ గౌడ్, ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, యువజన విభాగం అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి లీలానంద గౌడ్, కోశాధికారి నిమ్మల ధాత్రినాథ్ గౌడ్, గౌడ సంఘం ప్రముఖులు పి అశోక్ గౌడ్, యాదగిరి గౌడ్, కరుణాకర్ గౌడ్, రాచమల్ల ఓం ప్రకాష్ గౌడ్, నిమ్మల ఆనంద్ గౌడ్, మూల అనిల్ గౌడ్, ఏకాంత్ గౌడ్, లింగం గౌడ్, మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, వీరేందర్ గౌడ్, పవన్ గౌడ్, సాయికుమార్ గౌడ్, జగన్ గౌడ్, గణేష్ గౌడ్ మరియు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,చాంద్ పాషా, జహీర్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
