Spread the love

హుస్సేన్ రావుకు ఘనంగా నివాళులర్పించిన బైరెడ్డి, దారపనేని

కనిగిరి సాక్షిత

కనిగిరి నియోజకవర్గం పామూరు మండల మాజీ జడ్పిటిసి సభ్యులు, పామూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మోరు బోయిన హుస్సేన్ రావు యాదవ్ గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఫోను ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కదిరి పార్థసారధి, మాజీ మండల అధ్యక్షులు ఆవుల నాగేశ్వరరావు, సర్పంచ్ దేవన బోయిన సుబ్బయ్య, బోడవాడ సర్పంచ్ దాసరి చిన్నమాల కొండయ్య, మాజీ ఎంపీటీసీ చప్పిడి రామయ్య, గవదగట్ల హరి, బొడ్డు కొండయ్య, ఉప్పలపాటి హరిబాబు, కామిరెడ్డి తిరుపతిరెడ్డి, మహంకాళి వెంగయ్య బ్రదర్స్, మార్నేని ఆదినారాయణ, బండ్ల నారాయణ, వారి సోదరులు గ్రామ టిడిపి అధ్యక్షులు మోరుబోయిన గిడ్డయ్య యాదవ్, మోపాడు రిజర్వాయర్ సూపరు వైస్ చైర్మన్ నరసింహ యాదవ్, మోహన్ రావు యాదవ్, చిన్న ఉసేన్ యాదవ్, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గంగరాజు యాదవ్, మట్లే రాహుల్ యాదవ్, యర సింగ్ రాయుడు, రెక్కల రమణారెడ్డి, చావా సుబ్బారావు, ఓబుల్ రాజు యాదవ్ ,పలువురు ఉపాధ్యాయులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.