
వనపర్తి జిల్లా ఎస్.పి.ని కలిసిన బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు
వనపర్తి
వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్ని బి సి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి బీసీ ఉద్యమ సమస్యలు పరిష్కారం గురించి చర్చించడం జరిగింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పించాలని ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేస్తున్నామని అదేవిధంగా ప్రైవేటు విద్యాలయాల్లో విద్యార్థులపై మానసికంగా అణచివేస్తుండడం వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కాబట్టి వీటిపట్ల విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని కలిగించే విధంగా విద్యార్థులకు శిక్షణను ఇచ్చే విషయమై చర్చించడం జరిగింది. మరియు యువకులు మాదకద్రవ్యాలు గుట్కాల బారినపడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్నారని సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని కాబట్టి జూన్ మాసంలో యువకులకు సామాజిక చైతన్యం కార్యక్రమం చేస్తూ ” యువజన వికాసం – భవిష్యత్తు ” గురించి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కాబట్టి జిల్లా ఎస్పీ గిరిధర్ ని “నేరాలను తగ్గించడం – సామాజిక శాంతి నెలకొల్పడం ” అంశం పై శిక్షణ తరగతులకు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి సి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అమడబాకుల రామన్ గౌడ్ మాజీ ఎంపీటీసీ, బి సి ఎఫ్ మైనారిటీ విభాగం RMF వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఖదీర్ పాష, బి సి ఎఫ్ కొత్తకోట మండల అధ్యక్షులు దారమోని గంగాధర్ ముదిరాజ్, బి సి ఎఫ్ మైనారిటీ విభాగం RMF కొత్తకోట మండల అధ్యక్షులు షేక్ మైనోద్దీన్ , బి.సి ఎఫ్. యువజన విభాగం BCYF కొత్తకోట పట్టణ అధ్యక్షులు షేక్ ముషారఫ్ తదితరులు ఎస్పీ ని కలిసిన వారిలో ఉన్నారు.
