Spread the love

ఏపీలో వేసవి ముందే.. భగభగలు!

పల్నాడు : ఏపీ రాష్ట్రంలో ఉదయం మంచు ప్రభావానికి, జలుబు, శ్వాసకోశ సమస్యలుఎదుర్కోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత ఎక్కువ అవుతున్నాయి. ఉదయం 11గంటల నుంచే ఎండ తీవ్రత అధికం అవుతోంది. ప్రజలు బయటకెళ్లాలంటే భయపడాల్సి వస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఎండ వేడికి అల్లాడుతున్నారు. గత మూడు రోజులుగా భానుడి భగభగలు అన్నిజిల్లాలో పెరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే వీలుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పేదవాడి ఫ్రిజ్ అయిన మంచినీటి మట్టికుండలు, ఫ్రిజ్, ఏసి, కూలర్లు, ఇన్వర్టర్లు, కొనుగోలు, రిపేర్లు వేగవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. వ్యాపార వ్యవహారాల్లో, పలు కార్యాలయాలకు వెళ్లే వ్యక్తులు, భగభగ మండే భానుడి ప్రతాపానికి భయపడివడదెబ్బ తగలకుండా టోపీలను, గొడుగులు కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా జ్యూస్ లు, తాటి ముంజలు, సోడాలు, కూల్ డ్రింక్స్, పుచ్చకాయలు వ్యాపారాలు, ఊపందుకున్నాయి. ఏదేమైనప్పటికీ వాతావరణ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ సంవత్సరంభానుడి ప్రతాపానికి బెంబేలెత్తవలసి వస్తుందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చ