
డిప్టి తహసీల్దారుగా పదవీ విరమణ పొందుతున్న బక్షి శ్రీకాంత్ రావుకు శుభాకాంక్షలు తెలియజేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
వనపర్తి
బక్షి.శ్రీకాంతరావు కి రావుల పదవీ విరమణ శుభాకాంక్షలు.
డిప్యూటీ తహసీల్దార్ గా పదవీ విరమణ చేస్తున్న భక్షి. శ్రీకాంత్ రావుకి మాజీ ఎం.పి. రావుల చంద్రశేఖరరెడ్డి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.
రావుల తరపున బి.ఆర్.ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ శ్రీకాంత్ రావుని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రావుల ఫోన్లో మాట్లాడుతూ శ్రీకాంత్ రావు ఉద్యోగంతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిష్ణాతులు అని కొనియాడారు.
వారు 1984లో వి. వి.ఓ గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి వి.ఏ.ఓ,పంచాయితీ సెక్రటరీ,వి.ఆర్.ఓ,సీనియర్ అసిస్టెంట్(గిర్దావర్), డిప్యూటీ తహసీల్దార్ గా వివిధ హోదాలలో పని చేసి ప్రజలకు చేరువైనారని అన్నారు.
శ్రీకాంత రావు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి అని విశ్రాంత జీవితం సమాజసేవ కోసం ఉపయోగించాలని వారు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నందిమల్ల.అశోక్,ఎం.డి.గౌస్,వహీద్,కలెక్టరేట్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
