
బీజాపూర్ జిల్లాలో మరోసారి ఎదురు కాల్పులు?
చత్తీస్ గడ్:
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది..
జిల్లా నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. ఇంకా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉందని, ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇంద్రావతి టైగర్ రిజర్వుడు ఫారెస్టులో మావోయిస్టులు ఉన్నట్లు నిర్థిష్టమైన సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసు పడడటంతో వారి మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
మధ్యాహ్నం వరకు రెండు వైపులా అడపాదడపా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారని తెలిసింది. గాయపడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు
