Spread the love

పామూరులో ఘనంగా ముందస్తు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర జన్మదిన వేడుకలు నిర్వహించిన దారపనేని, బైరెడ్డి

కనిగిరి : నియోజకవర్గం పామూరు పట్టణంలో ఘనంగా ఆంటీ నందు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా టిడిపి శ్రేణులు నిర్వహించారు. ముందుగా పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి కేక్ కట్ చేసి కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ కు తినిపించారు. కనిగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివళుడు, అభివృద్ధే లక్ష్యంగా చేసుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ఆ భగవంతుడు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు, సిద్ధించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్టు టిడిపి శ్రేణులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉగ్రసేన నాయకులు తుమ్మ కొండారెడ్డి, టిడిపి నాయకులు పాలపర్తి వెంకటేశ్వర్లు, వరికూటి హనుమంతు, చిరంజీవి, ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉప్పుగళ్ల సురేష్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి కొండిశెట్టి వెంకట రమణయ్య, చావా సుబ్బారావు, రెక్కల రమణారెడ్డి, యరసింగ్ రాయుడు, మట్లె రాహుల్ యాదవ్, తదితర టిడిపి శ్రేణులు భారీగా పాల్గొన్నారు