TEJA NEWS

బీహార్ విజయంపై బీజేపీ సంబరాలు

తిరుపతి: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ ఘన విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బిజెపి సీనియర్ నాయకులు అజయ్ కుమార్, రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ డాక్టర్ శ్రీధర్, గాలి పుష్పలత, బిజెపి మండల అధ్యక్షులు లోక ప్రభాకర్ నాయుడు, దీపక్ యాదవ్, దస్తగిరి రెడ్డి, శ్రీధర్, జిల్లా నాయకులు సోము వేదవతి, రాయల్ అనూష, రామకృష్ణ, సాయి, ఏవన్ మస్తాన్, అన్నా రెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, జీవన్ రాయల్, శివా రాయల్, సాయి తదితరులు పాల్గొన్నారు.