TEJA NEWS

టీపీసీసీ ఆధ్వర్యంలో బిజెపి రాజకీయ వేధింపులకు నిరసనగా ఈ.డి కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్నా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

నేషనల్ హెరాల్డ్ పత్రిక అంశంలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై బీజేపీ ప్రభుత్వం కక్ష పూరితంగా చార్జిషీట్ లో పేర్లు నమోదును ఖండిస్తూ నిరసిసగా హైదరాబాద్ ఈ.డి కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాలో టీపీసీసీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్,టీపీసీసీ ఇంచార్జ్ సెక్రటరీ విశ్వ నాథం,టీపీసీసీ టీపీపీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర మంత్రులు,శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కలిసి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ధర్నాలో పాల్గోని మోదీ ప్రభుత్వని వ్యతిరేకంగా నినాదాలు చేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— రాహుల్ గాంధీ పై పెరుగుతున్న ఆరాధన చూడలేక, రాజకీయపరంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ములేక మా పార్టీ అగ్రనాయకులపై కక్షపూరిత కేసులు బనాయిస్తున్నారని అని అన్నారు..

— బిజెపి ప్రభుత్వం,నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను పక్కనపెట్టి, ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి, ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెట్టే పనిలో ఉన్నారని అన్నారు..

— స్వాతంత్ర సమరంలో త్యాగం చేసి, భారతదేశ సర్వసంపదను సమకూర్చినది కాంగ్రెస్ పార్టీ అన్నారు..

— నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లును ఛార్జిషీట్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు..

ఈ ధర్నా కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ కాంగ్రెస్ సభ్యులు,NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సేవదళ్ నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు..