Spread the love

BLC స్కీమును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొని వచ్చి BC, SC, ST లకు ఉచితముగా అధిక మొత్తాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం మాదేనని – MLA బొండా ఉమ వెల్లడి

సాయంత్రం 5:00 గం లకు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు BLC స్కీం దరఖాస్తుదారులతో, లబ్ధిదారులతో  అధికారులతో కూడిన సమావేశం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని దరఖాస్తు కి దరఖాస్తుదారులకు పూర్తి వివరాలను అందజేసినటువంటి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది…

ఈ సమావేశ వివరాలను బొండా ఉమామహేశ్వరరావు మీడియాకు వెల్లడి చేస్తూ:- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో  BLC స్కీం ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో ఎంపిక చేసిన 2140 దరఖాస్తు వివరాలను వెల్లడి చేయడమే కాకుండా 140 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను తన చేతుల మీదగా అందజేయడం జరిగింది..

గత ప్రభుత్వం ఈ BLC స్కీమును నిర్లక్ష్యం చేయడం వల్ల అనేకమంది  అర్హులైన పేదవారు  ఇల్లు నిర్మించుకోవాలని సొంత కళను  నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను సమావేశంలో సమావేశంలో బొండా ఉమా విరుచుకుపడ్డారు…

ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి NDA కూటమి ప్రభుత్వం పేదవారి  సొంత ఇంటి కలను నిజం చేసేటువంటి విధముగా ఈ BLC స్కీములో అనేక మార్పులు చేస్తూ  BC లకు 50వేలు, SC లకు 70వేలు, ST లకు 1లక్ష రూపాయలు అదనంగా ఇస్తూ అంటే గతంలో ఇచ్చినటువంటి 1లక్ష 80వేలకు అదనముగా BC లకు 2 లక్షల 30 వేలు, SC లకు 2 లక్షల 50వేలు, ST లకు 2 లక్షల 80వేలు ఇవ్వడం జరుగుతుందని పూర్తి వివరాలను వెల్లడి చేశారు…

NDA ఫోటో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 8 మాసాల కాలంలోనే సూపర్ 6 ను అమలు చేస్తూ  ఇంకా పేదలకు అవసరమైనటువంటి, ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం లో ఉన్న నారా చంద్రబాబునాయుడు నాయకత్వం ఈ NDA ప్రభుత్వం అని, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ను పెంచడానికి ముక్కుతో ములుగుతూ 5 సంవత్సరాలు కాలం తీసుకున్నది అంటే ఏ విధమైన ప్రజా వ్యతిరేక పాలన సాగించిందో ప్రజలందరికీ అర్థమవుతున్నటువంటి విషయమని, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను 4000 వేలు చేయడమే కాకుండా మూడు నెలల బ్యాలెన్స్ ను కూడా కలిపి 7వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని, అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తూ మహిళలకు గుదిబండ అయిన గ్యాస్ సిలిండర్ ను సంవత్సరానికి 3 సిలిండర్ లను మహిళలకు అందిస్తూ, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ఇచ్చేందుకు ప్రణాళికలు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు…

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 40 గజాలు, 30 గజాలు, 60 గజాలు ఉన్న పేదవారి స్థలాలలో ఉచితంగా ఈ BLC స్కీమును అమలు చేస్తున్నామని ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు తెలిపారు, ఇప్పటికే నియోజకవర్గ శాసన సభ్యులుగా నేను 140 కోట్ల రూపాయలతో 8 నెలల కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని, ఆరోగ్య నిమిత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు కార్పొరేట్ వైద్యశాలలో అధునాతనమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ ఆ ఖర్చులను భరించే నిమిత్తం సీఎం సహాయనిధిగా ఇప్పటికే ₹8 కోట్ల రూపాయలను అందించినటువంటి విషయాలతోపాటు అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకానికి రాజకీయాలకు అతీతంగా అందించినటువంటి అందించినటువంటి ఘనత మాది అని రాబోయేటువంటి రోజులలో నియోజకవర్గ ప్రజానీకానికి ఎటువంటి సమస్య ఉన్న సింగ్ నగర్ లోని నా కార్యాలయం అయిన MLA కార్యాలయానికి వచ్చి నాతో, నా సిబ్బందితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించుకొని లబ్ధి పొందేటువంటి విధముగా తీసుకోవాలని బొండా ఉమ సూచనలు చేశారు…

ఈ కార్యక్రమంలో:- టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఘంటా కృష్ణమోహన్, ఎరుబోతు రమణ, దాసరి ఉదయశ్రీ, బత్తుల కొండా, లబ్బా వైకుంఠం,పైడి శ్రీను, దాసరి దుర్గారావు అమ్మారావు,హౌసింగ్ DE O. విజయ్ బాబు, AE ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు….