TEJA NEWS

హైదరాబాద్‌, శామీర్‌పేట: మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. కలెక్టరేట్‌లో బాంబు పెట్టినట్లు ఏవోకు మెయిల్‌ ద్వారా దుండగులు బెదిరించారు. అప్రమత్తమైన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు, డాగ్‌స్క్వాడ్‌ ముమ్మర తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటివరకు అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.