Spread the love

అమరావతి పనులకు బ్రేక్..

రాజధాని అమరావతి పనులకు బ్రేక్ పడింది. టెండర్లు పిలవాల్సి ఉన్నా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది.

రాజధాని అమరావతి పనులకు బ్రేక్ పడింది. టెండర్లు పిలవాలన్నా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే టెండర్లు పిలవాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లను ఖరారు చేసే ప్రక్రియ మొదలుపెట్టడం సరికాదని సీఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్…
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమలులో ఉంది. రాజధాని అమరావతి పనులకు సంబంధించి నిధులు కూడా సిద్ధమయ్యాయి. టెండర్లను ఆహ్వానించి పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ పనులకు మంత్రి వర్గ సమావేశం ఆమోదించిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే టెండర్లను ఆహ్వీనించి ఖారారు చేసే అవకాశముంది.