
తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రాచాలను కలిసిన అర్చకులు *
వనపర్తి
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ను ధూపదీప నైవేద్య అర్చక సంఘం నాయకులు కలిసివిజ్ఞప్తి చేశారు.
ఈమేరకు శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో రాచాలను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా అర్చక సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2020 సంవత్సరంలో నియమించినటువంటి త్రిమెన్ కమిటీ ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉందని, అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అవేదన వ్యక్తం చేశారు.
కావున తమ సమస్యలపై దృష్టి సారించి ఉమ్మడి జిల్లా వారిగా కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లాల వారిగా త్రీమెన్ కమిటీ నియమించే విధంగా కృషి చేయాలని రాచాలను కోరారు.
దీనిపై స్పందించిన రాచాల యుగంధర్ గౌడ్ దూప దీప నైవేద్య అర్చకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ధూప దీప నైవేద్య అర్చక సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు పీవీ లక్ష్మీకాంతాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఎం రవీందర్రావు, ఎం బాల లింగయ్య, ఉమ్మడి కార్యదర్శి జోషి శ్రీధర్, జూరాల రవి,వెంకోబా, గాండ్ల రవి, మహేష్, చక్రవర్తి, చంద్రశేఖర్ జ్ఞానేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
