Spread the love

మలక్ పేట కు చెందిన BRS పార్టీ నాయకులు తీగల అజిత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సునరిత రెడ్డి దంపతులను మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. వారి కుమారుడు కనిష్క్ రెడ్డి ORR పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ముసారాం బాగ్ లోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట BRS పార్టీ నాయకులు ఆజాం, సామా ప్రభాకర్ రెడ్డి, విఠల్ రెడ్డి, నర్సింగ్, నరేష్ తదితరులు ఉన్నారు.