TEJA NEWS

శ్రీచైతన్య హై స్కూల్ విద్యార్థులను అభినందించిన బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఇటీవలే విడుదలైన పదవ తరగతి ఫలితాలలో శ్రీచైతన్య హైస్కూల్ లోని 27 మంది విద్యార్థులకు 550 పైన మార్కులు సాధించడంతో పాటు 100% ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ కనబరిచిన మహమ్మద్ సుహాన్, హిమాన్షు, కీర్తన అనే విద్యార్థులకు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మెడల్స్ ను బహుకరించి విద్యార్థులను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…విద్యార్థులు ఉత్తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఆ లక్ష్యాలను చేరుకునే విధంగా చదువులో రాణించినపుడు భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా రెడ్డి, సూరారం డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.