Spread the love

BRS పార్టీ సభ్యత్వ బీమా కార్యకర్తలకు ధీమా: మెతుకు ఆనంద్

వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త నల్ల యాదయ్య ఇటీవల మరణించారు వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో వారి గ్రామానికి వెళ్లి BRS పార్టీ నుండి మంజురైన రూ.2 లక్షల భీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..

BRS పార్టీ… సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబాలకు భరోసానిస్తున్నది.

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది కాబట్టి… ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి సభ్యత్వం చేయించే ప్రయత్నం చేయాలి.

పార్టీ సభ్యత్వ నమోదు చేయించుకుంటే దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి ఆ వ్యక్తి మరణించినట్లయితే Rs.2,00,000/- భీమా పొందే అవకాశం ఉంటుంది.