TEJA NEWS

అట్టహాసంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ చేతుల మీదుగా “అపురూప కమ్యూనిటీ హాల్” ప్రారంభం….

130 – సుభాష్ నగర్ డివిజన్ అపురూప కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అపురూప కమ్యూనిటీ హాల్ ను బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అందరికీ అందుబాటులో అపురూప కాలనీ వాసులతోపాటు సమీప కాలనీవాసులు వారి ఇళ్లలో నిర్వహించుకునే శుభకార్యాలు, పండుగలు, సాంస్కృతిక కార్యకలాపాలకు “అపురూప కమ్యూనిటీ హాల్” చక్కటి వేదిక అవుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, శేషాచారి, దుర్గారావు, పి ఎస్ ఎన్ రాజు, వల్లభనేని రమణ, పందిరి యాదగిరి, అపురూప కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిప్పారెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణారావు, సెక్రటరీ వివి రమణ, జాయింట్ సెక్రటరీ కిష్టారెడ్డి, కోశాధికారి సత్యనారాయణ, సభ్యులు సురేందర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, సీతారామ, హనుమంతరావు, అంజయ్య, ఎస్.కె.షఫీ బాబు తదితరులు పాల్గొన్నారు.