TEJA NEWS

తమ పుట్టిన రోజు సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు నాయకులు, అభిమానులు…

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, అభిమానులు తమ జన్మదినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నేడు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఎస్.ఆర్. నాయక్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు హరిబాబు యాదవ్, ప్రముఖ న్యాయవాది అద్దంకి వెంకటాచారి కుమార్తె అద్దంకి విద్వతిలను ఎమ్మెల్యే ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పలు డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.