నూతన మున్సిపాలిటీ భవనాన్ని సందర్శించిన బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ

TEJA NEWS

నూతన మున్సిపాలిటీ భవనాన్ని సందర్శించిన బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ

నెల్లూరు జిల్లాబుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని బెజవాడ గోపాల్ రెడ్డి పార్కు దగ్గర నూతనంగా నిర్మిస్తున్న మున్సిపాలిటీ భవన నిర్మాణ కార్యాలయ పనులను, పర్యవేక్షించిన బుచ్చి మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజ.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, మరియు కౌన్సిలర్ తో ఈ మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించడం జరిగిందని, ఈ భవన నిర్మాణ పనులను త్వరగా వేగవంతం చేసి పనులు చేపించిన కాంట్రాక్టర్ వెంకటశేషయ్యను చైర్ పర్సన్ అభినందించారు. ఈనెలఖరిలోగా ఈ మున్సిపల్ భవన కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ ఇనమల చినబాబు, వైస్ చైర్మన్ యరటపల్లి వెంకట శివ కుమార్ రెడ్డి, కౌన్సిలర్ బెలూమ్ మల్లారెడ్డి, ఏ.ఈ. వెంకటేష్ కాంట్రాక్టర్ వెంకట శేషయ్య పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top