
రైల్వే కోడూరు నియోజకవర్గం
70 లక్షల రూపాయల వ్యయంతో బుడిగుంటపల్లి టూ దేశెట్టి పల్లి గ్రామం వరకు సిమెంట్ రోడ్ మరియు తారురోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ఎమ్మెల్యే అరవ శ్రీధర్
రైల్వే కోడూరు మండలంలోని బుడిగుంటపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ ఇద్దరు నేతలకు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల వ్యవధిలోనే నియోజకవర్గంలో సగానికి పైగా సిసి రోడ్ల పనులు పూర్తయ్యాయి. ప్రజల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ, ఈ ఇద్దరు నాయకులు పనిచేస్తున్న విధానంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “ప్రతి గ్రామానికి సి.సి. రోడ్లు, మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయని” తెలిపారు.
అరవ శ్రీధర్ మాట్లాడుతూ ,”ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో సగానికి పైగా సిసిసి రోడ్లు పూర్తయ్యాయి. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. మున్ముందు మరిన్ని పనులు జరుగుతాయి. ఈ ప్రయాణంలో రూపానంద రెడ్డి వంటి నాయకులు నాకు అండగా ఉండటం వల్లే మనం ఇంత వేగంగా ముందుకు సాగగలుగుతున్నాం. మీరు ఇచ్చిన ఆదరణతో రాబోయే రోజులలో మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇంకా బాగా పనిచేస్తాము.” అని అన్నారు. ఈ కార్యక్రమం లో NDA కూటమి నాయుకులు, ప్రజలు పాల్కొన్నారు
