
చిలకలూరిపేట తహసీల్ధార్ కార్యాలయం వద్ద బర్లీ పొగాకు రైతులు ఆందోళన. ఎం ఆర్ వో కి వినతి పత్రం
చిలకలూరిపేట:
వివరాల్లోకి వెళితే గత సంవత్సరం దాకా పొగాకు ధరలు బాగా ఉండటంతో రైతులు విస్తారంగా సాగు చేశారు.
సాగు ఖర్చులు పెరిగినా కూడా కొంత మిగులుతుందని ఆశతో అప్పులు చేసి మరి పోగాకు పంటని సాగుచేశారు.
ఎక్కువ మంది రైతులు పొగాకు పంటను సాగు చేశారు అనే కారణంతో పొగాకు కంపెనీలు పొగాకు కొనకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు.వారి ఏజెంట్ల ద్వారా తక్కువ ధరకు పొగాకు కొని రైతులకు అన్యాయం చేస్తున్నారు. అన్ని పొగాకు కంపెనీల వారు ఏకమై రైతులను మోసం చేస్తున్నారు.
గత సంవత్సరం దాకా 15-18 వేల రూపాయలకు కొన్న పొగాకు ఈ సంవత్సరం 4 వేల నుండి 5 వేల వరకు కొంటున్నారు.సిగరెట్టు, బీడీ ధరలు తగ్గలేదు, కంపెనీల షేర్ల ధరలు తగ్గలేదు, కానీ కష్టపడి పండించే పొగాకు రైతుల ధరలు మాత్రం తగ్గిస్తున్నారు.ఇటువంటి కష్ట కాలంలో మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించేవారు లేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.దయచేసి ప్రభుత్వం మా గోడును ఆలకించి మమ్మల్ని ఆదుకోవాలని ఎమ్మార్వో గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి మా బాధను మా కష్టాన్ని గుర్తించాలని వారి తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము.
