
సింధూరం పెట్టి పెళ్లి అయిందని నమ్మించి, యువతిని మోసం చేసిన సాప్ట్‌వేర్ ఉద్యోగి
మంచిర్యాల జిల్లాకు చెందిన సాయి ప్రణీత్ (26) బెంగుళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, అక్కడే ఒక క్లినిక్‌లో పనిచేసే యువతి పరిచయం అయింది. ఇద్దరు ఒకే హాస్టల్‌లో ఉండేవారు
తన తండ్రికి గుండెపోటు వచ్చిందని సొంతూరు ఒడిశాకు వెళ్లిన యువతికి రోజు ఫోన్ చేసి సాయి ప్రణీత్ యోగక్షేమాలు అడిగేవాడు… ఇలా స్నేహం ఏర్పడి, ఆ స్నేహం ప్రేమగా మారింది
ప్రేమలో పడ్డాక కేరళ టూర్ వెళ్లి అక్కడ హోటల్‌లో నుదుటన సింధూరం పెట్టి పెళ్లి అయిపోయిందని యువతిని నమ్మించాడు. 2023లో ఇద్దరు షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి తల్లిదండ్రులను పరిచయం చేయడంతో ఆ యువతికి అతని మీద నమ్మకం మరింత పెరిగింది
2024లో ఇద్దరు ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి జూబ్లీహిల్స్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని నివసించారు
అయితే గత ఏడాది నవంబర్ లో చెల్లికి పెళ్లి కుదిరిందని మంచిర్యాల వెళ్లిన యువకుడు తిరిగి రాకపోవడంతో యువతికి అనుమానం వచ్చి అతన్ని నిలదీసింది. రూ.20 లక్షలు తీసుకోని మన బంధం మర్చిపోవాలని అతను చెప్పడంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది
జూబ్లీహిల్స్ పోలీసులు యువకుడి మీద లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
