
ఓటరు జాబితా సవరణలో అప్రమత్తంగా పనిచేయాలి….
— కోరుకంటి చందర్…
పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:రామగుండం, రామగుండం నియోజకవర్గంలోని రామగుండం పట్టణ ఇంచార్జ్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన 25, 26, 27, 28, 29, 30 డివిజన్ల బూత్ స్థాయి ప్రతినిధుల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ హాజరై రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై బూత్ స్థాయి ప్రతినిధులకు సమగ్ర అవగాహన కల్పించారు.
ఓటర్ల వివరాల నమోదు, మార్పులు, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అప్రమత్తంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో పార్టీ నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వహించాలని కోరారు. ఓటరు జాబితా సవరణలో బూత్ స్థాయి ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
సమావేశం అనంతరం బూత్ స్థాయి ప్రతినిధులకు రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మూల విజయ రెడ్డి, 26వ డివిజన్ కార్పొరేటర్ బాదావత్ నర్సమ్మ–సారయ్య నాయక్, మాజీ కార్పొరేటర్ నారాయణదాసు మారుతి, తెలంగాణ ఉద్యమ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
