Category: TELANGANA

TELANGANA

కూలిపోవడం కొత్త కాదు: హరీశ్ రావు ప్రాజెక్టులు, నిర్మాణాలు కూలిపోవడం కొత్త కాదని హరీశ్ రావు చెప్పారు. గతంలో జరిగిన ఘటనలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేవాదుల ఫేస్-3 టన్నెల్ అప్పట్లో కూలిపోయింది. సింగూరు డ్యాం గేట్లు కొట్టుకుపోయాయి. పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉండగానే పడిపోయింది. కాంగ్రెస్ హయాంలోనే మూసీ గేట్లు కొట్టుకుపోయాయి. ఏపీలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది అని తెలిపారు. కాళేశ్వరం విషయంలో తప్పు జరిగితే బాధ్యులను శిక్షించాలని…

నేడు కేసీఆర్‌ బర్త్‌ డే.. రాష్ట్రవ్యాప్తంగా పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్.. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు పని చేశారు. నేడు కేసీఆర్‌ 70వ బర్త్‌ డే నేడు.. ఈ సందర్భంగా హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గులాబీ దళపతి అభిమానులు, పార్టీ శ్రేణులు కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు రెడీ అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అనాథలకు సహాయం ఎప్పటిలాగే చేసేందుకు పార్టీ…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు నాణ్యతాలోపంతో బ్యారేజీ కుంగిందన్నారు. అవినీతి, నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పూర్తి దెబ్బ తిందన్నారు. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీ మూడేళ్లలోనే కుప్పకూలిందన్నారు.

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారు. కాగజ్‌నగర్‌ నుండి ఉదయం 5:30 బయలు దేరి 10 గంటలకు వరంగల్ చేరుకుంటుంది. మళ్ళీ వరంగల్ నుండి మధ్యాహ్నం12 గంటలకు బయలు దేరి సాయంత్రం 4 గంటలకు కాగజ్‌నగర్‌ చేరుకుంటుంది.…

హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు పిలుపునిచ్చారు.. ఉచిత బస్సుల వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ…

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రస్తావించింది. ఒకే బైక్‌పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్ లో 84, ఆటోలో 126 గొర్రెలు రవాణా చేసినట్టు కాగ్ నివేదికలో తేలింది. అంబులెన్సులోనూ గొర్రెలు తరలించినట్లు రికార్డులో తెలపడం విస్మయానికి గురి చేసింది. కారు, బస్సుల్లోనూ గొర్రెలు తీసుకెళ్లినట్లు రికార్డులు ఉండటం సంచలనంగా…

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం కోసం తీసుకున్న అప్పుల్లో 12 ఏళ్లలో ప్రభుత్వం భరించాల్సింది రూ.2.66 లక్షల కోట్లకు చేరనుంది. అసలు కాకుండా వడ్డీలతో కలిపి రుణాల తిరిగి చెల్లింపులకే రూ.1.41 లక్షల కోట్లు అవసరం అవుతాయని లెక్క తేల్చారు.…

మహబూబ్‌నగర్‌:- మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను కాల్చి చంపారు. ఈ కుక్కలను తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తున్నది. తుపాకుల మోత వినిపించకుండా సైలెన్సర్ బిగించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ చంపడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు కాల్చింది ఎవరు? ఎందుకు తుపాకులతో…

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాల ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత…

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం కంటే గొప్ప మార్గం ఏముందని ట్విట్టర్‌ వేదికగా సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ప్రియతమ నాయకుడు కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా, ఆయన మార్గదర్శక నాయకత్వానికి కృతజ్ఞతగా, గౌరవానికి చిహ్నంగా ఉండే వృక్షార్చన ఉద్యమాన్ని ప్రజలంతా ఆదరించాలని…