
మహాదేవపురం కమలమ్మ నగర్ లో సిసి రోడ్లు మంజూరైన కాలనిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 125 డివిజన్ మహాదేవపురం కమలమ్మ కాలనీ నివాసుల విన్నపం మేరకు 60 లక్షలతో సిసి రోడ్లు మంజూరైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆయా కాలనీలలో పర్యటించడం జరిగింది..
అనంతరం కమలమ్మ కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కూన శ్రీశైలం గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
మహాదేవపురం కమలమ్మ కాలనీవాసుల కల నెరవేరింది అన్నారు..
నియోజకవర్గం అన్ని డివిజన్ల అభివృద్ధి నా లక్ష్యం అన్నారు..
కమలమ్మ కాలనీ వాసుల తరుపున ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి ధన్యవాదాలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ప్రసాద్,వెంకట్ రెడ్డి, యాదవరావు,రమణారెడ్డి,శ్రీనివాసరావు, రామచంద్ర రెడ్డి,దిలీప్,ప్రవీణ్,ప్రభాకర్ రెడ్డి,దేవేందర్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,నవీన్ రావ్,కోటేశ్వరరావు,భాస్కర్,కాంతారావు, నారాయణరెడ్డి,విజయ్,రాజిరెడ్డి,
రామకృష్ణ,నాగరాజు, సింహాచలం, మల్లేష్,పార్థసారథి,కృష్ణ తో పాటు మహాదేవపురం మరియు కమలమ్మ నగర్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..
