
దద్దరిల్లిన దండేపల్లి
కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో అంబరాన్ని అంటిన సంబరాలు
బారి ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ
అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లు, రాజీవ్ యువ వికాసం పథకం, శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపినందుకు,రైతులకు పంట బోనస్ రూపాయలు ఇచ్చినందుకు మరియు మంచిర్యాల నియోజకవర్గం లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అనేక అభివృద్ధి కారులుక్రమలతో పాటు దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మరియు కడెం ప్రాజెక్టు ద్వారా పుష్కలమైన సాగునీరు అందిస్తూ దండేపల్లి మండలాన్ని సస్య శామలంగ తీర్చిదిద్దుతున్నందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కి ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ,సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ,రేవంత్ రెడ్డి ,భట్టి విక్రమార్క, ప్రేమ్ సాగర్ రావు , పేర్ల నినాదాలతో దండేపల్లి మండల కేంద్రం దద్దరిల్లింది. డప్పు వాయిద్యాలు, బ్యాండ్ మెలాలతో బాణాసంచ టపాకాయలు పెల్చుతు బారి ర్యాలీ తీసినారు.ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ తో అంబేద్కర్ విగ్రహం వరకు చేరి అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసినారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు సువర్ణ అక్షరాలతో లిఖించదగినవని కొనియాడారు. భారత్ జూడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు,కుల గణన, వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని అన్నారు మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలబెట్టుటకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు నిరంతరంగా శ్రమిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రైతులు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
