TEJA NEWS

కంచ గచ్చిబౌలిలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ

TG: కంచ గచ్చిబౌలి భూముల్లో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ పర్యటిస్తోంది. స్థలాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్య యనం చేయనుంది. అనంతరం ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేస్తుంది. దాన్నిబట్టి అత్యున్నత న్యాయస్థానం విచారణ కొనసాగించనుంది. ఆ భూములను వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా HCU విద్యార్థులతో పాటు సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. చివరికి SC జోక్యంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.