TEJA NEWS

మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్…

వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ మామునూరు ఎయిర్పోర్ట్…

మామునూరు ఎయిర్పోర్టు కల సాకారం ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి మరియు మంత్రుల కృషి….

వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

వరంగల్ జిల్లా మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు ఇచ్చారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కి.మీ పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జీఎంఆర్ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరుకు జీఎంఆర్ అంగీకారం తెలిపిందన్నారు….

జీఎంఆర్ అంగీకారం తెలపడంతో విమానాశ్రయం పనులు చేపట్టేందుకు పౌరవిమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని రామ్మోహన్ నాయుడు ఆదేశించారు అన్నారు….

ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే జీవో విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల శాఖ లేఖ రాసింది. మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కి. మీ. ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు, భవనాల శాఖ వెల్లడించింది అన్నారు….

నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. భారత్, చైనా యుద్ధ సమయంలో కీలక సేవలందించాయి. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ ‘రెక్కలు’ రానున్నాయి. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి మళ్లీ విమానం ఎగరనుంది అన్నారు…

రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మామునూరు ఎయిర్పోర్టు కల సాకారమైందని ఒక ప్రకటనలో తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …

కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఎయిర్పోర్టు పనులు వేగవంతమవుతాయన్నారు…

మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం అనుమతి తెలపడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి జిల్లా మంత్రి కొండ సురేఖ, సీతక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఎమ్మెల్యే నాగరాజు ధన్యవాదాలు తెలియజేశారు…