
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా “ఛలో వరంగల్” బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక వాల్ పోస్టర్ ఆవిష్కరణ….
నగరంలోని నంది హిల్స్ లోని కేటీఆర్ నివాస కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆధ్వర్యంలో రూపొందించబడిన “ఛలో వరంగల్” బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల వాల్ పోస్టర్ ను బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు కుత్బుల్లాపూర్ నుంచి భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుగారు, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
