TEJA NEWS

పార్టీ పరంగా కార్యకర్తలు.. ప్రభుత్వంలో ప్రజలే చంద్రబాబు తొలి ప్రాధాన్యత : ప్రత్తిపాటి

అనైక్యత, అభిప్రాయబేధాలతో ప్రభుత్వానికి.. పార్టీకి చెడ్డపేరు వస్తోంది. ఇప్పటికైనా తీరు మార్చుకోండి…

నియోజకవర్గ గెలుపులో పట్టణ క్యాడర్ పనితీరు కీలక పాత్ర పోషిస్తోంది…

శాశ్వత అధికారమే మనందరి ఏకైక లక్ష్యమని గ్రహించండి..

వైసీపీ దుష్ప్రచార కట్టడిలో పార్టీ శ్రేణులు మెరుపువేగంతో స్పందించాలి.

బూత్..క్లస్టర్.. యూనిట్ ఇన్ ఛార్జ్ లు.. పార్టీ శ్రేణులకు ప్రత్తిపాటి దిశానిర్దేశం.

కూటమిప్రభుత్వ ఏడాది పాలన… ప్రభుత్వ పనితీరు.. ప్రజలకు అందించిన సంక్షేమం.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత టీడీపీ శ్రేణులదేనని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పదవులు పొందిన వారు ప్రజల్లోకి వెళ్లకపోతే కోరి సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని ప్రత్తిపాటి తెలిపారు. శాశ్వత అధికారమే లక్ష్యంగా, గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలన్నారు. సోమవారం ఆయన స్థానిక క్యాంప్ ఆఫీసులో, పార్టీ కార్యాలయంలో బూత్.. క్లస్టర్.. యూనిట్ ఇన్ ఛార్జ్ లు, నాదెండ్ల, యడ్లపాడు మండల నాయకులతో సమావేశమయ్యారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశం’ ప్రధాన ఉద్దేశాన్ని.. ప్రభుత్వ ఆలోచనల్ని… పార్టీ భవిష్యత్ లక్ష్యాలను ప్రత్తిపాటి వారికి వివరించారు. ప్రధానంగా పట్టణపరిధిలోని ఇన్ ఛార్జ్ లు.. కే.ఎస్.ఎస్ (కుటుంబసాధికార సారథి) లు ప్రభుత్వ పనితీరును విస్తృతంగా ప్రచారం చేయాలని, మైటీడీపీ యాప్ లో ఎప్పటికప్పుడు తమ పరిధిలోని 50 ఇళ్ల వివరాలు నమోదు చేయాలని ప్రత్తిపాటి సూచించారు. ప్రభుత్వ పథకాలు.. రాయితీలను పార్టీ శ్రేణులు కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ పార్కులు, కేంద్ర రాష్ట్రప్రభుత్వ సబ్సిడీ రుణాలతో శ్రేణులు మెరుగైన భవిష్యత్ కు బాటలు వేసుకోవచ్చని ప్రత్తిపాటి చెప్పారు.

వైసీపీ చేయలేని అభివృద్ధి..సంక్షేమాన్ని కూటమిప్రభుత్వం ఏడాదిలోనే చేసింది

పదవులు పొందిన వారు ప్రజల్లో తిరగాల్సిందేనని, తమకు బాధ్యతలేదన్నట్టు వ్యవహరిస్తే వారే నష్టపోతారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. ఏడాదిపాలనపై ప్రజల సంతృప్తి ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత బూత్..క్లస్టర్..యూనిట్ ఇన్ ఛార్జ్ లు..కే.ఎస్.ఎస్ లదేనన్న ప్రత్తిపాటి. ప్రతి ఇంటికీ వెళ్లి.. గత ప్రభుత్వ పాలనకు.. కూటమి ఏడాదిపాలన మధ్య వ్యత్యాసాన్ని అర్థమయ్యేలా వివరించాలన్నారు. గత పాలకులు బటన్ నొక్కుడుపేరుతో చేసిన మోసాల్ని.. పాలన ముసుగులోసాగించిన దోపిడీని ప్రజలకు వివరించాలన్నారు. ఐదేళ్లలో వైసీపీ చేయలేని అభివృద్ధి.. సంక్షేమం కూటమిప్రభుత్వం కేవలం సంత్సరంలోనే చేసినదాన్ని ప్రజలకు ఓపిగ్గా వారికి వివరించాలన్నారు. గ్రామాల్లోని ఎన్నారైలను సంప్రదించి వారిని పీ-4లో భాగస్వాముల్ని చేయాలన్నారు. గ్రామనాయకత్వం పీ-4పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. బూత్ కన్వీనర్లు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తే టీడీపీ గెలుపు నల్లేరుపై నడకే అవుతుందని ప్రత్తిపాటి తెలిపారు. ప్రతి కన్వీనర్ తన పరిధిలోని 400-500 ఇళ్లలోని వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. మన నాయకత్వం రాష్ట్రానికి… ప్రజలకు చేసిన మంచి గురించి చెప్పుకుంటే చాలని, రాష్ట్రంలో మరేపార్టీకి పుట్టగతులు కూడా ఉండవని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. ప్రతి ఒక్కరూ రోజులో ఒక గంటైనా పార్టీకి.. ప్రజలకు కేటాయిస్తే ఊహించని ఫలితాలు వస్తాయన్నారు.

పార్టీపరంగా కార్యకర్తలు.. పాలనాపరంగా ప్రజలే నాయకుడి తొలిప్రాదాన్యత..

పార్టీ పరంగా కార్యకర్తలు.. పాలనాపరంగా ప్రజలే చంద్రబాబుకు ముఖ్యమని, ప్రభుత్వంలో ఉన్నందున మన నాయకుడు ప్రజల అవసరాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే సత్యాన్ని పార్టీ కేడర్ గ్రహించాలని ప్రత్తిపాటి సూచించారు. మా నాయకుడే రాష్ట్రాన్ని నిలబెట్టాడని ప్రతి కార్యకర్తల కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకునే రోజులు వస్తాయన్నారు. కార్యకర్తల కష్టాన్ని మన నాయకులు చంద్రబాబు, లోకేశ్ అర్థం చేసుకున్నారని, ఎప్పుడు ఎలా తమసైనికుల రుణం తీర్చుకోవాలో వారికి బాగా తెలుసునని ప్రత్తిపాటి చెప్పారు. ప్రజలకు మంచిచేస్తున్న ప్రభుత్వంపై వైసీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని.. జగన్, వైసీపీ నేతలు.. ఆ పార్టీ సోషల్ మీడియా బృందం కల్పిత విషప్రచార కట్టడిలో పార్టీ శ్రేణులు చురుగ్గా వ్యవహరించాలని ప్రత్తిపాటి సూచించారు. రాష్ట్రప్రగతే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు సంకల్పం.. పట్టుదలలో మనమూ భాగస్వాములవుదామని ప్రత్తిపాటి శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, నియోజకవర్గ పరిశీలకులు ఉషా రాణి, ముప్పెన వెంకటేశ్వర్లు, మద్దిరాల గంగాధర్, వీరంజీ, రవి టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్, పటాన్ సమద్ ఖాన్, మద్దుమలా రవి, కందుల రమణ, ఇనగంటి జగదీష్, క్లస్టర్, యూనిట్, బూత్, వార్డు, గ్రామ, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, పాల్గొన్నారు.