Spread the love

పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం మాజీమంత్రి ప్రత్తిపాటి. జగన్ అవినీతి, అనాలోచనలకు బలైన ప్రాజెక్ట్ పూర్తికి కూటమిప్రభుత్వం ధృఢ సంకల్పంతో పనిచేస్తోంది ప్రత్తిపాటి గత ప్రభుత్వ మోసాలకు బలైన నిర్వాసితుల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రత్తిపాట కన్నింగ్ ఆలోచనలు, కమీషన్ల కక్కుర్తితో గత పాలకులు పోలవరాన్ని బలిపీఠం ఎక్కించారు ప్రత్తిపాటి తెలుగు ప్రజల జీవనాడిని జీవచ్ఛవం చేసిన ఘనుడు జగన్ మాజీమంత్రి ప్రత్తిపాటి. ప్రాజెక్ట్ ను కూటమిప్రభుత్వం కృతనిశ్చయంతో పూర్తిచేయడం, జగన్ కు కన్నీళ్లు మిగలడం ఖాయం పుల్లారావు జగన్ కమీషన్ల కక్కుర్తి, కన్నింగ్ ఆలోచనలకు బలిపీఠమెక్కి పోలవరాన్ని పూర్తిచేయడమే లక్ష్యంగా కూటమిప్రభుత్వం అడుగులేస్తోందని, ప్రాజెక్ట్ ను అనుకున్నవిధంగా పూర్తి చేయాలన్న ధృఢ చిత్తంతో చంద్రబాబు ఉన్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. 9 నెలల్లో మూడోసారి చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలన చేస్తున్నారని, జగన్ మోసానికి బలైన నిర్వాసితులకు అండగా నిలవనున్నారని మాజీమంత్రి ఒక ప్రకటనలో తెలిపారు కన్నింగ్ ఆలోచనలు, కమీషన్ల కక్కుర్తితో గతపాలకులు పోలవరాన్ని బలిపీఠం ఎక్కించారు..


జగన్ అవినీతి, అనాలోచనలకు బలైన ప్రాజెక్ట్ పూర్తికి కూటమిప్రభుత్వం ధృఢ సంకల్పంతో పనిచేస్తోంది. గత ప్రభుత్వ మోసాలకు బలైన నిర్వాసితుల రక్షణే ప్రజాప్రభుత్వ తొలి ప్రాధాన్యత. కన్నింగ్ ఆలోచనలు, కమీషన్ల కక్కుర్తితో గత పాలకులు పోలవరాన్ని బలిపీఠం ఎక్కించారు. తెలుగు ప్రజల జీవనాడిని జీవచ్ఛవంగా మార్చిన ఘనత జగన్ ది. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో పోలవరాన్ని రివర్ లో ముంచేశాడు. అధిక పరిహారం ఆశచూపి నిర్వాసితులను నమ్మించి కొండలు గుట్టల పాలు చేశాడు. వరదలవేళ వారికి సరైన ఆహారం, తాగునీరు కూడా అందించలేదు. వైసీపీప్రభుత్వ వంచనతో విసిగిపోయిన ప్రాజెక్ట్ నిర్వాసితులు ఒకానొకదశలో తమఊళ్లను తెలంగాణ ప్రభుత్వంలో కలపాలని మొరపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. స్వార్థ ప్రయోజనాలతో పొరుగురాష్ట్రంతో లాలూచీపడి ప్రాజెక్ట్ ఎత్తుతగ్గించింది గత ప్రభుత్వం కాదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లడం ద్వారా పోలవరం నిర్మాణాన్ని, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను, ప్రజల నీటి అవసరాలను జగన్ ప్రశ్నార్థకంగా మార్చలేదా?
జగన్ 5 ఏళ్లలో 5 శాతం పనులు చేయలేదు జగన్ సర్కార్ నిర్లక్ష్యం, 2020వరదలు ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి. ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్, గైడ్ బండ్ దెబ్బతిన్నా కూడా జగన్ ప్రాజెక్ట్ పరిశీలించి నష్టనివారణ చర్యలపై ఆలోచన చేయలేదు. టీడీపీ హాయాంలో 72శాతం పూర్తైన ప్రాజెక్ట్ పనుల్లో, జగన్ 5 ఏళ్లలో5 శాతం పనులు కూడా చేయలేదంటే ఎంత నిర్లక్యమో ఆలోచించండి. ఆఖరికి నీళ్లు వదిలితే రైతులు చంద్రబాబు పేరు చెప్పుకుంటారన్న అక్కసుతో పట్టిసీమ మోటార్లు కూడా ప్రారంభించని సంకుచిత స్వభావి జగన్. వైసీపీనేతలు ప్రాజెక్ట్ కాలువగట్లను తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నా ముఖ్యమంత్రిగా జగన్ స్పందించలేదు. రాష్ట్రాన్నే తవ్వేసుకున్నా పర్లేదన్నట్లుగా వ్యవహరించాడు రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలన్నదే చంద్రబాబు జీవితాశయం గత ప్రభుత్వంలా కేంద్ర నిధుల్ని సొంతానికి వాడుకునేది లేదని, మరీ ముఖ్యంగా పోలవరం నిధుల్ని దారిమళ్లించే ఆలోచన లేదన్న చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాజెక్ట్ పూర్తిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. కేంద్రప్రభుత్వ సహాకారంతో ఎట్టిపరిస్థితుల్లో ప్రాజెక్ట్
పూర్తిచేసి, రాష్ట్రంలో కరవుకు తావులేకుండా చేయాలన్నదే చంద్రబాబు జీవితాశయం. ప్రాజెక్ట్ ను కూటమిప్రభుత్వం కృతనిశ్చయంతో పూర్తిచేయడం, జగన్ కు కన్నీళ్లు మిగలడం ఖాయం” అని పుల్లారావు తేల్చిచెప్పారు.