
చంద్రగిరి మండలం కొటాల గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని .
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని .
ఎమ్మెల్యే నాని కి ఘనస్వాగతం పలికిన మండల అధికారులు , కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు
కొటాల గ్రామపంచాయతీలోని గుర్రప్పగారి పల్లి, బందర్లపల్లి, కొటాల మాదిగవాడ గ్రామాలలో సుమారు కోటి రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే .
పంచాయతీ పరిధిలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం, పైపు కల్వర్టు , సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే .
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీలలోని శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి: ఎమ్మెల్యే .
గ్రామపంచాయతీలో అద్దె భవనంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే .
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు, సిబ్బందికి తెలిపిన ఎమ్మెల్యే.
కొటాల పి.హెచ్.సి లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే .
ఆశా వర్కర్ల సేవలు మరువలేం… మీకు ఏ సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకురండి… నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటా: ఎమ్మెల్యే పులివర్తి నాని
చిన్న చిన్న సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని సిబ్బందికి తెలిపిన ఎమ్మెల్యే .
గత కొన్ని సంవత్సరాలుగా త్రాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే… గ్రామంలో బోరు వేసి త్రాగునీరు బోరు మోటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే .
నూతన కల్వర్టు కు భూమి పూజ నిర్వహించిన హాజరైన ఎమ్మెల్యే .
గత వైసీపీ ప్రభుత్వంలో వర్షాకాల సమయంలో ఐతేపల్లి – రంగంపేట మార్గమధ్యంలో కొటాల పంచాయతీ పరిధిలోని కల్వర్టు కొట్టుకుపోయింది.
గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు అధికారులకు గత పాలకులకు చెప్పిన పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
