
చంద్రగిరిలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , కూటమి ప్రభుత్వ నాయకులు.
ఆపరేషన్ సింధూర్ లో పాల్గొని పాకిస్తాన్ నుంచి దేశాన్ని రక్షించడంలో అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించిన ఎమ్మెల్యే .
మన జాతీయ పతాకానికి గౌరవం, ఆపరేషన్ సింధూరం విజయవంతం, మన వీర జవాన్లకు సంఘీభావం, దేశ రక్షణలో ప్రజల భాగస్వామ్యం గూర్చి తిరంగా ర్యాలీ నిర్వహించారు.
చంద్రగిరి నాగాలమ్మ గుడి వద్ద నుండి , టవర్ క్లాక్ వరకు త్రివిధ దళాల పరాక్రమాన్ని కీర్తిస్తూ భారీగా సాగిన తిరంగా ర్యాలీ.
ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన భారతీయుడు అని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం:ఎమ్మెల్యే
నాని ర్యాలీలో దారి పొడవునా వందేమాతరం , భారత్ మాతాకీ జై అని నినదిస్తూ… జాతీయ జెండాను చేతపట్టి ముందుకు సాగిన తిరంగా ర్యాలీ.
తిరంగా ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని
