Spread the love

సకాలంలో పన్నులు వసూలు చేయండి.

స్వచ్ఛ సర్వేక్షన్ లో తిరుపతిని మొదటిస్థానంలో నిలపండి.

కమిషనర్ ఎన్.మౌర్య

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అన్ని పన్నులు సకాలంలో వసూలు చేయాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షన్ లో ర్యాంకింగ్, నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2024-2025 సంవత్సరానికి ఇంటి పన్నులు, నీటి పన్నులు, భూగర్భ డ్రైనేజి పన్నులు ఖాళి జాగా పన్నుల బకాయిలు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. పన్నులు చెల్లించని నీటి కొళాయి కనెక్షన్, విద్యుత్ శాఖ వారి ద్వార ఇంటి కరెంటు కన్నెక్షన్లు డిస్కనెక్ట్ తొలగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎక్కువ మంది పన్నుల మినహాయింపు వస్తుందనే ఉద్దేశ్యంతో చెల్లించడం లేదని అధికారులు తెలిపారు. పన్నులు సకాలంలో చెల్లిస్తే ఏదైనా మినహాయింపు వస్తే కచ్చితంగా అందరికీ వర్తింపు చేస్తామని చెప్పారు.

స్వచ్ఛ సర్వెక్షన్ తిరుపతిని మొదటి స్థానంలో నిలపండి.

దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షన్ తిరుపతిని మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రజలతో కలసి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. తిరుపతి నగరంలో పారిశుద్ధ్యం మెరుగ్గా చేపడుతున్నామని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు అందరూ చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షన్ ప్రజల మొబైల్స్ ద్వారా మంచి అభిప్రాయంతో ఓటింగ్ వేసేలా అవగాహన కల్పించాలని అన్నారు. తద్వారా తిరుపతిని మొదటిస్థానంలో నిలిపేందుకు వీలుంటుందని అన్నారు. నగరంలోని ప్రజలు http//sbmurban.org. ద్వారా ఓటు వేసి మన నగరాన్ని ప్రథమ
స్థానంలో నిలపాలని కోరారు. నగరంలో చెత్త కుప్పలు ఉన్నా, పారిశుద్ధ్యం లోపించినా, డ్రెయినేజీ కాలువలు శుభ్రం చేయకున్నా టోల్ ఫ్రీ నెంబర్లు 0877-2256766, 9000822909 కాల్ చేయాలని ప్రజలకు తెలిపారు. ప్రతి రోజూ మీ ఇంటి వద్దకు చెత్త వాహనం వస్తోందని అందరూ తడి, పొడి చెత్త వేర్వేరుగా అందించాలని ప్రజలను కోరారు. అలా కాకుండా రోడ్లమీద, కాలువల్లో చెత్త వేస్తే అపరాధ రుసుము విధిస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.సి.పి. మహాపాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డి.ఈ.లు, ఏ.సి.పి.లు, తదితరులు ఉన్నారు.