
చెనికల వారి నాగర్పమ్మ కొలుపుల్లో పాల్గొన్న దారపనేని
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో సోమవారం చెనికల శ్రీనివాసులు, ధర్మపత్ని శ్రీమతి చిన్న ఓబులమ్మ, కుమారులు రవి, సురేష్, రమేష్ కుటుంబ సభ్యులు నాగర్పమ్మ కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఈ కొలుపుల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని కొలుపులు నిర్వహిస్తున్న చెనికల శ్రీనివాసులు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కొలుపుల్లో తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ దారపనేని జనార్దన్ రావు, మాజీ ఎంపీటీసీలు చెనికల పెదమాల కొండయ్య, వెంగమ్మ, ఆదిత్య కాలేజీల కరస్పాండెంట్ గడ్డం వెంకటరత్నం, చెనికల చిన్న మాల కొండయ్య, దారపనేని కృష్ణ, రాజేంద్రప్రసాద్, నరసింహనాయుడు,యరసింగ్ వెంకటేశ్వర్లు, రాయుడు, మిరియం సుబ్బరాయుడు, మానం మల్లికార్జున రావు, చెనికల మనోజ్, నాగేశ్వరరావు, మల్లికార్జున, కృష్ణ, మహేష్ బాబు,చెనికల వారి కుటుంబ సభ్యులు, మానం వారి కుటుంబ సభ్యులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్పమ్మ దేవస్థానంలో కొలుపుల్లో పాల్గొన్న భక్తులకు చెనికల శ్రీనివాసులు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
