TEJA NEWS

పేదప్రజల ఆరోగ్యభద్రత ముఖ్యమంత్రి సహాయనిధి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి ప్రాంతానికి చెందిన
ఎస్. మంజుల కేరాఫ్ పాపిరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వైద్య సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు 1.75 లక్షల రూపాయలు మంజూరు చేయించి కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో బాధితులకు ఎల్వోసీ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….పేదప్రజల ఆరోగ్య సంజీవని ముఖ్యమంత్రి సహాయనిధి, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వైద్యం కోసం ఎదురుచూసేవారు ఎల్వోసీ ని పొంది చికిత్సను పొందాలన్నారు.