Spread the love

విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని వనపర్తికి వస్తున్నారు

ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం

జిల్లాలో ఇప్పటివరకు 6 మంది విద్యార్థులను బలి తీసుకున్న ప్రభుత్వం

_తెలంగాణ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వంశీ యాదవ్

వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 5800 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఇప్పటివరకు జిల్లాలో ఆరు గురు విద్యార్థులను బలి తీసుకుందని ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జిల్లాలో ఏ ముఖం పెట్టుకొని పర్యటిస్తారో తెలుపాలని మార్చి 2న సీఎం పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు వంశీ యాదవ్ తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయిన మద్యానికి మంత్రిని నియమించిన ఈ ప్రభుత్వం ఇంకా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు ప్రభుత్వ మరియు గురుకుల హాస్టల్ లో విద్యార్థులు పిట్టల రాలిపోతున్న స్పందించని ముఖ్యమంత్రి అని అన్నారుj ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు శివ నగర కార్యదర్శి దేవి ప్రసాద్ శ్రీమన్ బబ్లు మనీ శివ తదితరులు పాల్గొన్నారు