Spread the love

యాదవ సామాజిక వర్గానికీ ఎమ్మెల్సీ కేటాయించాలి.

సూర్యపేట జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి యాదవ సామాజిక వర్గానికీ కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 30 నుంచి 40 వేల ఓట్లు కలిగిన అతి పెద్ద సామాజిక వర్గం యాదవులు అన్నారు. సూర్యాపేట జిల్లా నుంచి శాసనసభలో ఒక్క యాదవ సామాజిక వర్గానికీ చెందిన ఎమ్మెల్యే లేరన్నారు. ఈ జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికీ చెందిన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ సీటు కేటాయించి యాదవ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చెవిటి వెంకన్న యాదవ్ గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీని అన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నారని చెప్పారు.

అధికారం ఉన్నా.. లేకపోయినా పార్టీలోనే ఉంటూ కార్యకర్తలకు అండగా నిలబడ్డారు అన్నారు. అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ కేటాయించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, గొడ్డేటి సైదులు యాదవ్, కోడి లింగయ్య యాదవ్, రమేష్ యాదవ్, కంచు గట్ల జానయ్య, నాగరాజు, బిక్షపతి యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కాసం రాము యాదవ్, మల్లేష్, వెంకటేష్, సైదులు, వేల్పుల లింగయ్య యాదవ్, కంచుగట్ల యాదగిరి యాదవ్, మర్యాద రాజు యాదవ్, కుర్ర సైదులు యాదవ్, నర్సయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు.